మంత్రి శ్రీధర్ బాబు భావోద్వేగం.. ప్రభుత్వానికి కృతజ్ఞతలు

by Disha Web Desk 2 |
మంత్రి శ్రీధర్ బాబు భావోద్వేగం.. ప్రభుత్వానికి కృతజ్ఞతలు
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీపాద రావు జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. శనివారం రవీంద్ర భారతిలో శ్రీపాద రావు జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. శ్రీపాద రావు జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడానికి సిద్ధమవుతుందని ఊహించలేదని అన్నారు. దీనికి సహకరించిన ప్రతీ ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు.

ఈ వేడుకలు అధికారికంగా జరగడానికి ఉమ్మడి కరీంనగర్ ఎమ్మెల్యేల కృషి ఉన్నదని కొనియాడారు. ఈ కార్యక్రమానికి రాజకీయాలకు అతీతంగా అందరినీ ఆహ్వానించామన్నారు. ఇక నుంచి శ్రీపాద రావు జయంతి వేడుకలను హైదరాబాద్‌లో ప్రతీ ఏటా ఘనంగా నిర్వహిస్తామన్నారు. మరణించే క్షణం వరకు శ్రీపాద రావు ప్రజా జీవితంలోనే గడిపారన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఇంటికి వెళ్లి వస్తూ, అనుకోని సంఘటనలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. సర్పంచ్ స్థాయి నుండి రాష్ట్ర స్పీకర్ స్థాయి వరకు ఎదిగిన ఆయన రాజకీయ జీవితం తమ అందరికీ ఆదర్శమన్నారు.


Next Story

Most Viewed