- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
పీపుల్స్ ప్లాజాలో బతుకమ్మ ఆడిన మంత్రి సీతక్క
by M.Rajitha |
X
దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రవ్యాప్తంగా నేడు ఎంగిలి పూల బతుకమ్మ(Bathukamma) వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. బతుకమ్మ సంబురాల్లో తొలిరోజు అయిన ఎంగిలిపూల బతుకమ్మను తీరొక్క పూలతో పేర్చి ఆడపడుచులు అంతా కూడి ఆడిపాడుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసిన బతుకమ్మ సందడి నెలకొంది. ఈ నేపథ్యంలో తెలంగాణ శిశు, మహిళా సంక్షేమశాఖ మంత్రి సీతక్క(Seethakka) హైదరాబాద్(Hyderabad) లోని నెక్లెస్ రోడ్ లో గల పీపుల్స్ ప్లాజాలో బతుకమ్మ ఆడారు. అంతకంటే ముందు అత్యంత భక్తి శ్రద్దలతో ఎంగిలిపూల బతుకమ్మను పేర్చిన సీతక్క, మహిళలందరితో కలసి బతుకమ్మ ఆడిపాడారు. తెలంగాణ ఆడపడుచుల గౌరవానికి బతుకమ్మ ప్రతీక అని, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా బతుకమ్మ సంబురాలు జరపుకొని తెలంగాణ ప్రతిష్టను ఎల్లలు దాటిస్తారని వ్యాఖ్యానించారు.
Advertisement
Next Story