అంగన్ వాడీలకు మంత్రి సీతక్క భారీ గుడ్ న్యూస్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంపుపై కీలక ప్రకటన

by Satheesh |   ( Updated:2024-07-31 05:36:09.0  )
అంగన్ వాడీలకు మంత్రి సీతక్క భారీ గుడ్ న్యూస్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంపుపై కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని అంగన్ వాడీ టీచర్లు, కార్యకర్తలకు మంత్రి సీతక్క గుడ్ న్యూస్ చెప్పారు. అంగన్ వాడీలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను డబుల్ చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. ప్రస్తుతం అంగన్ వాడీ టీచర్లకు రిటైర్ అయ్యే సమయంలో ప్రభుత్వం రూ.లక్ష ఇస్తుండగా దానిని రెట్టింపు చేసి రూ.2 లక్షలు ఇస్తామని తెలిపారు. అలాగే అంగన్ వాడీ కార్యకర్తలకు ప్రస్తుతం రూ.50 వేలు ఇస్తుండగా దానిని డబుల్ చేసి రూ.లక్ష అందిస్తామని వెల్లడించారు. అంగన్ వాడీల రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ పెంపుకు సంబంధిన ప్రతిపాదలను ఇప్పటికే ఆర్థిక శాఖకు పంపించినట్లు సీతక్క వెల్లడించారు. ఆర్థిక శాఖ నుండి గ్రీన్ సిగ్నల్ రాగానే పెంపు అమలు చేస్తామని తెలిపారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ డబుల్ చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అంగన్ వాడీ టీచర్లు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed