Shridhar Babu: కౌశిక్ రెడ్డి వర్సెస్ గాంధీ ఇష్యూపై మంత్రి శ్రీధర్ బాబు రియాక్షన్

by Prasad Jukanti |
Shridhar Babu: కౌశిక్ రెడ్డి వర్సెస్ గాంధీ ఇష్యూపై మంత్రి శ్రీధర్ బాబు రియాక్షన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఘర్షణ పడితే దానికి కాంగ్రెస్‌కు ఏం సంబంధమని మంత్రి శ్రీధర్‌బాబు ప్రశ్నించారు. పెద్దపల్లి జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో ఇవాళ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి పర్యటించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. పాడి కౌశిక్‌రెడ్డి, అరికెపూడి గాంధీ ఇష్యూపై స్పందిస్తూ.. సొంత పార్టీలో వారికి వారికి పడకపోతే దాన్ని తమకు అంటగడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్న తీరును ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. అర్హులైన రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామన్నాన్నారు. సాంకేతిక కారణాలతోనే కొంతమందికి మాఫీ జరగలేదన్న శ్రీధర్ బాబు.. రుణమాఫీ విషయంలో వెనక్కి తగ్గబోమన్నారు.

Advertisement

Next Story