బండి సంజయ్‌కి మంత్రి పొన్నం ప్రభాకర్ స్ట్రాంగ్ కౌంటర్

by Disha Web Desk 4 |
బండి సంజయ్‌కి మంత్రి పొన్నం ప్రభాకర్ స్ట్రాంగ్ కౌంటర్
X

దిశ, హుస్నాబాద్ : బండి సంజయ్ రాజకీయ డ్రామాలకు తెరలేపారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం ఎన్నికల ప్రచార సందర్భంగా తాను బండి సంజయ్‌ను ప్రశ్నించానన్నారు. 5 సంవత్సరాల పదవి కాలంలో బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రజలకు ఏం చేశారో చెప్పాలన్నారు. శ్రీరాముని పేరు మీద ఓట్లు అడగడం కాదని.. మీరు నిజంగా నియోజకవర్గ ప్రజలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. తాను ఎన్నడూ అనని మాటలను తనకు ఆపాదించడం తగదన్నారు. రాముడి పుట్టుక, అయోధ్య రాముడి అక్షింతలు, నా తల్లి జన్మకు సంబంధించి బండి మాట్లాడటం సమంజసం కాదన్నారు.

తల్లి ఎవరికైనా తల్లే అని.. రాజకీయంగా అభివృద్ధికి సంబంధించిన విషయాలపై ప్రశ్నిస్తే బండి ఇలా మాట్లాడటం సరికాదన్నారు. రాజకీయంగా డ్రామాలు చేస్తూ బండి సంజయ్ యాత్రని కొనసాగిస్తున్నారని మంత్రి పొన్నం ఫైర్ అయ్యారు. అతని యాత్రకి ప్రచారం రావాలని అడ్డుకున్నట్టు కొత్త డ్రామాలకు తెరలేపారన్నారు. మేము మీ యాత్రలు అడ్డుకోవడం లేదన్నారు. ప్రజా స్వామ్యంలో యాత్ర చేసే హక్కు అందరికి ఉందని.. మీరు మాట్లాడిన మాటలపై చట్టరిత్యా చర్యలు తీసుకోవాలని అంటున్నారు కదా.. అయితే ప్రజలు, ప్రజాస్వామ్యమే మనకు చట్టం అన్నారు.

భార్యకి మంగళ సూత్రం కడతారు. అటువంటి మంగళ సూత్రం అమ్మి ఎన్నికల్లో గెలిచాను అని బండి సంజయ్ చెబుతుంటారు. మరి తల్లిపై బండి చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర, కేంద్ర నాయకత్వం ఆలోచించాలన్నారు. వాళ్ళని అడుగుతున్న ఇటువంటి నాయకునికి డ్రామాలకు సమర్థిస్తున్నారా..? అని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుని, ఈ జిల్లాకి సంబంధించిన బీజేపీ నాయకులు నియోజకవర్గానికి సంబంధించి ఐదేళ్లలో ఏం చేశారో చెప్పాలన్నారు.

తాను ఎంపీగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులను ప్రజలు ఒకసారి గమనించాలన్నారు. మీరు నియోజకవర్గాల్లో ఏం చేయలేదని ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని ఓడిపోతానే భయంతో ఇటువంటి ప్రస్తావన తీసుకొస్తున్నారని మండిపడ్డారు. ఆనాడు కేసీఆర్ హిందుగాళ్లు బొందుగాళ్లు అంటే రాజకీయంగా ఎన్నికల్లో ఏవిధంగా వాడుకున్నావో అందరికీ తెలుసన్నారు. తల్లిపై చేసిన మాటలతో బండి సంజయ్ రాజకీయంగా సమాధి కావడం ఖాయమన్నారు. బండి సంజయ్ జాగ్రత్త అంటూ పొన్నం వార్నింగ్ ఇచ్చారు. మేము హింసావాదులం కాదని.. శవం మీద పేలాలు ఏరుకునే రకం కాదన్నారు. యాత్ర చేసుకో ఏమైనా చేసుకో.. కానీ నాలుక, ఒళ్ళు రెండు దగ్గర పెట్టుకొని బండి సంజయ్ మాట్లాడాలని పొన్నం హెచ్చరించారు.

Next Story

Most Viewed