స్కూళ్ల రీ-ఓపెన్‌పై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |
స్కూళ్ల రీ-ఓపెన్‌పై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఈనెల 12వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పున:ప్రారంభిస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఖమ్మం జిల్లా తిరుమాయపాలెంలో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో పాల్గొని మాట్లాడారు.. ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా రూ.650 కోట్లతో అమ్మ ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. అంతేకాదు.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన మిషన్ భగీరథ పథకాన్ని కూడా పునరుద్ధరిస్తామని వెల్లడించారు.

ధరణి బాధితుల నుంచి దరఖాస్తులు కూడా త్వరలో స్వీకరిస్తామని హామీ ఇచ్చారు. కొత్త రేషన్ కార్డుల పంపిణీ, ఆసరా పెన్షన్లపై మరో రెండు మూడు రోజుల్లో గుడ్ న్యూస్ చెబుతామని అన్నారు. అంతేకాదు వాటిని అమలు చేసే బాధ్యత కూడా తానే తీసుకుంటాని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తామని మరోసారి భరోసా ఇచ్చారు. ఇప్పటికే ఈ గ్యారంటీలను అమలు చేసేందుకు ప్రజల వద్ద నుంచి ధరఖాస్తులు సైతం స్వీకరించినట్లు గుర్తుచేశారు.

Next Story

Most Viewed