ఎన్నికల లోపు కోహెడ మార్కెట్ సిద్ధం కావాలి.. మంత్రి నిరంజన్ రెడ్డి

by Dishafeatures2 |
ఎన్నికల లోపు కోహెడ మార్కెట్ సిద్ధం కావాలి.. మంత్రి నిరంజన్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎన్నికల లోపు కోహెడ మార్కెట్ ను సిద్ధం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​రెడ్డి పేర్కొన్నారు. దశల వారీగా కోహెడ మార్కెట్ నిర్మాణాలను చేపట్టాలని, మొదటి దశ పనుల నిర్మాణాలను కేవలం 9 నెలల్లోనే అందుబాటులోకి తీసుకురావాలని ఆయన కోరారు. మార్కెట్ నిర్మాణాల పరిస్థితిపై ఆయన మినిస్టర్​ క్వార్టర్స్​ లో శుక్రవారం ప్రత్యేక రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మార్కెట్ నిర్మాణాలకు అవసరమైన సౌకర్యాలు, నిధులు కల్పించేందుకు సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉన్నదని, పనుల్లో పురోగతి కల్పించాలని మంత్రి సూచించారు. మొదటి దశలోనే మార్కెట్ పూర్తి స్థాయిలో పనిచేయుటకు అవసరమైన మౌళిక వసతులు కల్పనకు అనుమతులు కూడా వచ్చాయన్నారు.

ప్రస్తుతం ఉన్న వయాంట్ సొల్యూషన్ కన్సల్టెంట్ తో పాటు రాష్ట్ర మార్కెటింగ్ బోర్డుల ఎండీ సూచనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఇక మిషన్ భగీరధ పథకం నుండి రోజుకు 2.4 లక్షల లీటర్ల తాగునీరు తీసుకునేందుకు రూ.4 కోట్ల వ్యయంతో పనులు మొదలు పెట్టాలని మంత్రి ఆదేశాలిచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీభాయి, అదనపు సంచాలకులు లక్ష్మణుడు, కొసాంబో ఎండీ జేఎస్ యాదవ్, ఎస్ఈ రాధాకృష్ణమూర్తి , మార్కెట్ కార్యదర్శి చిలుక నర్సింహారెడ్డి ,డీఈ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed