సబితక్కకు కోపం వచ్చినా సరే.. మీ ఆందోళన నాకు నచ్చింది: KTR

by GSrikanth |
సబితక్కకు కోపం వచ్చినా సరే.. మీ ఆందోళన నాకు నచ్చింది: KTR
X

దిశ, డైనమిక్ బ్యూరో: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీని మంత్రి కేటీఆర్ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో, అధికారులతో సమీక్ష నిర్వహించారు. మెస్ బాత్రూం సరిగ్గా లేదన్నారు. కొత్త మెస్సే ఇలా ఉంటే, పాత మెస్ ఇంకెలా ఉండేదోనని అన్నారు. కొంత సమయం ఇస్తే అన్ని సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. కాలేజీ సమస్యలను గుర్తించి అధికారులను నియమించామని, త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని కేటీఆర్ తెలిపారు. ఒక సంస్థను ఏర్పాటు చేయడం కన్నా దానిని మెయింటెనెన్స్ చేయడం కష్టమన్నారు. విద్యార్థులు ఇన్నోవేటివ్‌గా ఆలోచించి కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ పలు మౌలిక సదుపాయాలను ప్రకటించారు. యూనివర్సిటీలో మినీ టీ హబ్ ఏర్పాటు చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. 1000 కంప్యూటర్లతో డిజిటల్ ల్యాబ్, నవంబర్‌లో విద్యార్థులందరికీ ల్యాప్టాప్లు అందజేస్తామన్నారు. 50 అదనపు మోడ్రన్ తరగతులను నిర్మించినున్నట్లు తెలిపారు. ఆడిటోరియంను పునరుద్ధరిస్తామన్నారు. దీంతో పాటు రూ.3 కోట్ల ఖర్చుతో స్పోర్ట్స్ స్టేడియంను నిర్మించనున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. క్యాంపస్‌లోని పలు సమస్యలు పరిష్కరించామని, మరికొన్ని పరిష్కరించాల్సి ఉందని కేటీఆర్ తెలిపారు.

సబితక్కకు కోపం వచ్చినా సరే.. మీ ఆందోళన నాకు నచ్చింది

సమస్యల పరిష్కారం కోసం బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు చేపట్టిన ఉద్యమం తనను ఎంతగానో ఆకట్టుకుందని మంత్రి కేటీఆర్ అన్నారు. గాంధీ మార్గంలో శాంతియుత పద్ధతిలో విద్యార్థులు ఉద్యమించడం అభినందనీయమని తెలిపారు. రాజకీయాలకు, హింసకు తావులేకుండా పోరాడడం గొప్ప విషయమన్నారు. విద్యార్థుల ఆందోళనలో రెండు విషయాలు కేటీఆర్‌ను మెప్పి్ంచాయన్నారు. మొదటిది వాడిని, వీడిని ప్రతిపక్ష నాయకులను పిలువకుండా ట్రిపుల్ ఐటీ సమస్యలపై మాత్రమే ఆందోళన చేపట్టిన విధానం కేటీఆర్ నచ్చిందన్నారు. రెండవది 'నేను చెబితే మా అక్కకు కోపం వస్తుంది. కానీ, చెప్తాను..మీరు ఎంచుకున్న పద్ధతి చాలా బాగా నచ్చింది' కేటీఆర్ అన్నారు. గాంధీలా శాంతియుతంగా.. వర్షం పడుతున్న లెక్కచేయకుండా పోరాడడం మంత్రి కేటీఆర్ మెప్పించిందని, విద్యార్థులపై ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాకుండా, ఇక్కడి సమస్యలున్నాయన్న మాట నిజమేనని.. వాటిని కలిసికట్టుగా పరిష్కరించుకోవాలని కేటీఆర్ సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి కేటీఆర్ భోజనం చేశారు. నవంబర్‌లో మళ్లీ యూనివర్సిటీని సందర్శిస్తానని చెప్పారు. యూనివర్సిటీ పరిశుభ్రంగా ఉండేందుకు విద్యార్థులు కూడా సహకరించాలని సూచించారు.

Next Story