బ్రిటన్ ప్రధాని రాజీనామాను ప్రస్తావిస్తూ మోడీపై KTR సెటైర్లు

by Disha Web |
బ్రిటన్ ప్రధాని రాజీనామాను ప్రస్తావిస్తూ మోడీపై KTR  సెటైర్లు
X

దిశ, డైనమిక్ బ్యూరో: బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. బ్రిటన్ చరిత్రలోనే అతి తక్కువ రోజులు (కేవలం 45 రోజులు మాత్రమే) ప్రధానిగా పని చేసి ఆమె అపకీర్తిని మూటకట్టుకున్నారు. పన్ను కోతలపై గత నెల ప్రవేశ పెట్టిన మినీ బడ్జెత్‌తో మార్కెట్లు కుదేలు కావడం, డాలర్‌తో పోలిస్తే పౌండ్ విలువ రికార్డు స్థాయికి పడిపోవడం తదితర పరిణామాల నేపథ్యంలో లిజ్ ట్రస్ రాజీనామా చేశారు. ఈ సందర్భంగా లిజ్‌ట్రస్ రాజీనామాను ప్రస్తావిస్తూ ప్రధాని నరేంద్ర మోడీపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. తన విఫలమైన ఆర్థిక విధానాల కారణంగా 45 రోజుల కంటే తక్కువ వ్యవధిలోనే ప్రధాని పదవికి లిజ్ ట్రస్ రాజీనామా చేసినట్టు వార్తలు చదివి ఆనందించానని కేటీఆర్ ట్వీట్ చేశారు. మన దేశంలో కూడా ఒక ప్రధాని ఉన్నారని.. ఆయన మనకు ఏం ఇచ్చారంటే.. '30 ఏళ్ల కాలంలో అత్యధిక నిరుద్యోగం, 45 ఏళ్ల కాలంలోనే అత్యధిక ద్రవ్యోల్బణం, ప్రపంచంలో అతి ఎక్కువ గ్యాస్ ధర, అమెరికా డాలరుతో పోలిస్తే అతి తక్కువ రూపాయి విలువ' అని ఎద్దేవా చేశారు.


Next Story