రేవంత్, కోమటిరెడ్డి కరెంట్ వైర్లు పట్టుకుంటే.. రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది: KTR

by Disha Web Desk 19 |
రేవంత్, కోమటిరెడ్డి కరెంట్ వైర్లు పట్టుకుంటే.. రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది: KTR
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటల కరెంట్ రావడం లేదంటున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కరెంట్ వైర్లు పట్టుకుంటే రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలిపోతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మంత్రి కేటీఆర్ యాదాద్రిలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డికి వ్యవసాయం గురించి అసలు ఏమి తెలియదని, ఆయనకు పబ్బులు, క్లబ్‌లు మాత్రమే కావాలని విమర్శలు గుప్పించారు. 24 గంటల కరెంట్ కావాలా.. కాంగ్రెస్ పార్టీ కావాలా అని ప్రశ్నించారు. 24 గంటల కరెంట్ కావాలంటే సీఎం కేసీఆర్ ఉండాలన్నారు. ఇప్పటికీ 11 సార్లు గెలిచిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి ఏం చేసిందని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు మళ్లీ ఒక్క చాన్స్ ఇస్తే ఆగం అవుతామని, తెలంగాణ పాలన ఢిల్లీ నేతల చేతిలోకి వెళ్తే మనకు ఇబ్బందులు తప్పవన్నారు. తెలంగాణ అభివృద్ధితో పాటు సుభిక్షంగా ఉండాలంటే మరోసారి కేసీఆర్‌ను గెలిపించాలని ఓటర్లకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.


👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Read Disha E paper
👉 Follow us on Google News
👉 Follow us on whatsapp channelNext Story