బ్రేకింగ్: మీడియాపై మంత్రి కేటీఆర్ సీరియస్

by Disha Web Desk 19 |
బ్రేకింగ్: మీడియాపై మంత్రి కేటీఆర్ సీరియస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: మీడియాపై మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు. మీడియా బాధ్యతగా ఉండాలంటూనే మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం బీఆర్కేఆర్ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్‌ను ప్రశ్న అడిగిన ఓ జర్నలిస్టుపై మండిపడ్డారు. ‘ మీడియాకు కూడా కొంత బాధ్యత ఉంది.. బాధ్యత రాహిత్యంగా చేయకండి.. మీడియా ఈజ్ ఏ ఫోర్త్ ఎస్టేట్.. నెత్తి, కత్తిలేనోడు ఏదో మాట్లాడుతాడు.. దానిని పట్టుకొని మీరు అడుగుతారా? అర్ధం చేసుకోండి ఇక్కడ జరుగుతుంది ఏందో.. ప్రభుత్వంలో బాధ్యతగల మంత్రిని.. మీకేం బాధ్యత ఉంది.. నీకేం బాధ్యత ఉంది బ్రదర్.. నాలుగుకోట్ల ప్రజలు కలిసి గెలిపించినారు.. నాలుగుకోట్ల ప్రజలు కలిసి గెలిపించినారయ.. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం మాది.. మాకు తెలియదా ఏంది?

మీ.. నీదగ్గర నేర్చుకోవాలా నేను.. ఏం వాయిస్ ఎక్కడి వాయిస్.. నేను అనేది అన్న.. ఇట్లాంటి వాయిస్‌లు చాలా ఉన్నాయి దేశంలా.. అడగడానికి ఓపిక లేదా?.. నువ్వేమన్న ఆర్నాబ్ గోస్వామివా?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఏం చేయాలో తెలుసునంటూనే ఆగ్రహించారు. యూట్యూబ్‌లో అడ్డమైన వీడియోలు.. పెట్టి బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించొద్దని, యువతలో లేనిపోని అనుమానాలు సృష్టించడం మంచిది కాదు.. పనికిమాలిన వార్తలు ప్రచారం చేయొద్దని కోరారు. మాకెంత బాధ్యత ఉందో.. మీడియాకు అంతే బాధ్యత ఉంది.. అర్ధం చేసుకోండి అంటూనే చురకలు అంటించారు. మంచిని మంచిగా చూపండి అని కేటీఆర్ రిపోర్టర్లకు సూచించారు.


Next Story

Most Viewed