వరద బాధితులకు అండగా నిలవండి.. పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు

by Dishafeatures2 |
వరద బాధితులకు అండగా నిలవండి.. పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షం ప్రభావిత ప్రాంత ప్రజలకు అండగా నిలవాలని పార్టీ ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో కొన్ని జిల్లాల్లో వరద ప్రభావం అధికంగా ఉన్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు ప్రజలకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ శ్రేణులు ప్రజలకు అవసరమైన నిత్యావసర సరుకులతో తోచిన సహాయం చేయాలని సూచించారు. వర్షాలతో తలెత్తుతున్న పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రాంగం పూర్తి నిబద్ధతతో కృషి చేస్తున్నదన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగానికి, అధికారులకు పార్టీ శ్రేణులు అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు.

బీసీ ప్రజాప్రతినిధుల సమావేశం వాయిదా

భారీ వర్షాల నేపథ్యంలో స్థానికంగా ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉండి ప్రజలకు సేవాకార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉందని, అందుకే శుక్రవారం జరగాల్సిన బీసీ ప్రజాప్రతినిధుల సమావేశం వాయిదా వేస్తున్నట్లు బీసీ మంత్రులు గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. గురువారం మీడియా ప్రకటన విడుదల చేశారు. బీసీ ప్రజాప్రతినిధులు, సంఘాల నేతలతో ఎంసీఆర్ హెచ్ఆర్డీ లో నిర్వహించాల్సిన జీవో విడుదల సమావేశం, లోగో ఆవిష్కరణ కార్యక్రమం వాయిదా వేశామన్నారు. సమావేశం తేదీని త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ప్రజాప్రతినిధులంతా ప్రజాసేవాకార్యక్రమాల్లో ఉండాలని కోరారు.



Next Story

Most Viewed