దానం నాగేందర్‌ను గెలిపించే బాధ్యత నాదే.. మంత్రి కోమటిరెడ్డి హామీ

by GSrikanth |
దానం నాగేందర్‌ను గెలిపించే బాధ్యత నాదే.. మంత్రి కోమటిరెడ్డి హామీ
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మంగళవారం తుక్కుగూడలోని రాహుల్ గాంధీ సభ ఏర్పాట్లను సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కోమటిరెడ్డి పరిశీలించారు. పార్టీలు మారే మహేశ్వర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. ఇవాళ బీజేపీలో ఉన్న మహేశ్వర్ రెడ్డి.. రేపు ఏ పార్టీలో ఉంటాడో తెలియని ఎద్దేవా చేశారు. మహేశ్వర్ రెడ్డికి దమ్ముంటే ప్రధాని మోడీ ఇచ్చిన హామీలపై మాట్లాడాలని అన్నారు. మైక్ దొరికింది కదా అని ఏది పడితే అది మాట్లాడొద్దు అని హితవు పలికారు.

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్, భువనగిరి, నల్లగొండ స్థానాలు తప్పకుండా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. దానం నాగేందర్‌ను గెలిపించే బాధ్యత తనదే అని తెలిపారు. సికింద్రాబాద్‌ను కిషన్ రెడ్డి ఏనాడూ పట్టించుకోలేదు అన్నారు. కేబుల్ బ్రిడ్జి వేసి అభివృద్ధి అంటున్నాడని ఎద్దేవా చేశారు. ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టినా హరీష్ రావుకు బుద్ధి రావడం లేదని మండిపడ్డారు. కేసీఆర్ చేసిన పాపాల వల్లే రాష్ట్రంలో వర్షాలు పడటం లేదని అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed