'ఇబ్రహీంపట్నం సంఘటనపై రిపోర్టు వచ్చింది.. రెండు రోజుల్లో చర్యలు'

by Disha Web Desk 13 |
ఇబ్రహీంపట్నం సంఘటనపై రిపోర్టు వచ్చింది.. రెండు రోజుల్లో చర్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇబ్రహీంపట్నంలోని కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల వికటన అంశంపై రిపోర్టు వచ్చిందని, రెండు మూడు రోజుల్లో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి హరీష్​రావు తెలిపారు. ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తూనే ఉన్నదని, కానీ కొంత మంది నిర్లక్ష్యంగా వ్యవస్థకు చెడ్డ పేరు వస్తుందన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. గురువారం ఎంఎన్‌జే ఆసుపత్రిని సందర్శించిన ఆయన వార్డులు తిరుగుతూ.. చికిత్స పొందుతున్న పేషెంట్ల నుంచి వివరాలడికి తెలుసుకున్నారు. 450 పడకల హాస్పిటల్‌కు, మరో 300 పడకలు అదనంగా కలుపుతూమరో బిల్డింగ్ కడుతున్నామన్నారు.

వచ్చే నెల 15 న కొత్త హాస్పిటల్ ప్రారంభిస్తామన్నారు. దానికి అమెరికాలోని డాక్టర్ అద్దంకి శరత్, 3 ఏళ్ల పాటు, 300 బెడ్స్‌కు శానిటేషన్, హౌజ్ కీపింగ్ ఫెసిలిటీస్, సెక్యూరిటీ సిబ్బంది ఏర్పాటుకు సహకరిస్తున్నారన్నారు. జీతాలు, మెయింటెనెన్స్​అన్నీ ఆయనే చూసుకుంటానని హామీ ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. అంతేగాక ఇటీవలే మాడ్యులర్ థియేటర్స్ ప్రారంభించగా, కొత్తగా రోబోటిక్ థియేటర్ టెండర్ పిలుస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ విజయేంద్ర ప్రసాద్, డాక్టర్ శరత్‌లు పాల్గొన్నారు.


Next Story

Most Viewed