మంత్రి హరీశ్ రావు బడ్జెట్​స్పీచ్​'అదుర్స్'​

by Disha Web Desk 2 |
మంత్రి హరీశ్ రావు బడ్జెట్​స్పీచ్​అదుర్స్​
X

దిశ, తెలంగాణబ్యూరో: ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్​రావు తన బడ్జెట్ ప్రసంగంలో ఎక్కడా తడబడకుండా సజావుగా పూర్తి చేశారు. నాలుగోసారి ప్రవేశపెట్టిన మంత్రి మొదట్నుంచి చివరి వరకు అదే వేగంతో ప్రసంగాన్ని సభలో చదివి వినిపించారు. 89 పేజీలు కలిగిన బడ్జెట్​స్పీచ్‌ను కేవలం ఒక గంటా 44 నిమిషాల్లో పూర్తి చేశారు. దీంతో సభలో సభ్యులంతా మంత్రికి అభినందనలు తెలిపారు. హరీశ్ ఏది చేసినా రికార్డే అని తన సహచర మంత్రులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉండగా 2020–21 బడ్జెట్​సెషన్స్‌లో మంత్రి 1.02 గంటల్లో తన ప్రసంగాన్ని పూర్తి చేయగా, 2021–22లో 1.37 గంటలు, 2022–23లో 1.51 గంటల్లో ఫినిష్​చేశారు.


Next Story

Most Viewed