ఈ సారి అధికారంలోకి వస్తామనుకోవడం కాంగ్రెస్, బీజేపీ కళే: మంత్రి హరీష్ రావు

by Disha Web Desk 19 |
ఈ సారి అధికారంలోకి వస్తామనుకోవడం కాంగ్రెస్, బీజేపీ కళే: మంత్రి హరీష్ రావు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఈ సారి అధికారంలోకి వస్తామని కాంగ్రెస్, బీజేపీ నేతలు కలలు కంటున్నారని మంత్రి హరీష్ ఎద్దేవా చేశారు. ఆదివారం కామారెడ్డి జిల్లాలోని లింగంపేటలో బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కు 40 నుండి 50 నియోజకవర్గాల్లో అభ్యర్థులే లేరని.. అలాంటిది వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని హస్తం పార్టీ నేతలు కలలు కంటున్నారని సెటైర్లు వేశారు.

బీఆర్ఎస్ పార్టీది ఇరిగేషన్ పాలన .. కాంగ్రెస్‌ది మైగ్రేషన్ పాలన అని విమర్శలు కురిపించారు. కాంగ్రెస్ నేతలు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారని మండిపడ్డారు. ఇక, తెలంగాణలో బీజేపీ దుకాణం మూతపడేలా కనిపిస్తోందని.. కమలం పార్టీ నేతలు కొందరు బీఆర్ఎస్, కాంగ్రెస్ వైపు చూస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు పక్కన పెడితే.. బీజేపీ నేతలకు డిపాజిట్ల భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు వెంట ఎంపీ బీబీ పాటిల్, ఇతర బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.Next Story

Most Viewed