మేము హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచుతున్నాం.. మీరు పోగొట్టకండి: మంత్రి

by Gantepaka Srikanth |
మేము హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచుతున్నాం.. మీరు పోగొట్టకండి: మంత్రి
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ హోటల్స్, రెస్టారెంట్స్, బార్, మిల్క్ అసోసియేషన్ మెంబర్లతో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సమావేశమయ్యారు. హైదరాబాదులోని సచివాలయంలో తెలంగాణ కమిషనర్ ఫుడ్ సేఫ్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఈ భేటీ నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ.. ఆహారాన్ని కల్తీచేసే వారిపై, నాణ్యత పాటించని వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. నాణ్యమైన ఆహారాన్ని ప్రజలకు అందించాలని వివిధ అసోసియేషన్ ప్రతినిధులకు తెలియజేశారు. నిజాం కాలం నుండి హైదరాబాద్ బిర్యానీకి అంతర్జాతీయంగా గుర్తింపు ఉందన్నారు.

హైదరాబాద్‌ను మెడికల్ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఫుడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా‌గా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచుతున్నామన్నారు. హోటల్‌ల యజమానులు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని కోరారు. ప్రతి 6 నెలలకు ఒకసారి వర్క్ షాప్‌ల నిర్వహణతో పాటు అవగాహన సదస్సులను నిర్వహిస్తామన్నారు. హోటల్స్ యజమానులు చేసిన పలు విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, డైరెక్టర్ ఫుడ్ సేఫ్టీ డాక్టర్. శివలీల, తెలంగాణ స్టేట్ హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకట్ రెడ్డి, ఇండియన్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సందీప్, ఇండియన్ డైరీ మిల్క్ ప్రొడక్ట్స్ అసోసియేషన్ మెంబర్ సుల్తాన్ మస్కతి, అసోసియేషన్ ప్రతినిధులు రామాంజనేయులు, రాజశేఖర్, మనిష్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed