- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
స్టాఫ్ నర్స్ అభ్యర్థులకు అలర్ట్.. పరీక్ష తేదీ మార్పు
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం.. సెప్టెంబర్ 18 న 2050 నర్సింగ్ పోస్టుల భర్తికి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ మేరకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సెప్టెంబర్ 28వ తేదీ నుంచి అక్టోబర్ 14వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ, అక్టోబర్ 16 నుంచి 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఎడిట్ ఆప్షన్. నవంబర్ 17న కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ను నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. కాగా నవంబర్ 17న జరగనున్న సీబీటీ ఎగ్జామ్.. 23.11.2024 కు మార్చడం జరిగిందని.. అభ్యర్థులు దయచేసి గమనించగలరని మంగళవారం.. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
కాగా ఈ నోటిఫికేషన్ ద్వారా పబ్లిక్ హెల్త్‌లో 1576, తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో 332, ఆయూష్‌లో 61, ఐపీఎంలో ఒకటి, ఎంఎన్ జే క్యాన్సర్ ఆసుపత్రిలో 80 పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుదారులకు కనీసం 18 ఏళ్లు, గరిష్టంగా 46 ఏళ్ల వయో పరిమితి ఉంటుంది. వయసును 2024 జూలై 1 ఆధారంగా లెక్కిస్తారు. వివిధ వర్గాలకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయించిన వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. అప్లికేషన్ ఫీజు రూ. 200, పరీక్ష ఫీజు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. హైదరాబాద్, నల్లగొండ, కోదాడ, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేటల్లో పరీక్షా కేంద్రాలు ఉంటాయి.