రాచకొండ కమిషనరేట్‌లో 3000 ల మొక్కలతో మెగా ప్లాంటేషన్..

by Disha Web Desk 11 |
రాచకొండ కమిషనరేట్‌లో 3000 ల మొక్కలతో మెగా ప్లాంటేషన్..
X

దిశ, మేడిపల్లి: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా, రాచకొండ పోలీసులు రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఎలైట్, న్యూలాండ్ ల్యాబ్స్‌తో కలిసి శనివారం మేడిపల్లి గ్రామం, రాచకొండ కమిషనరేట్ భూమిలో 3000 మొక్కలతో మెగా ప్లాంటేషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కమిషనర్ ఆఫ్ పోలీస్ డీఎస్ చౌహాన్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్లాంటేషన్ డ్రైవ్‌ను ప్రశంసించారు. పర్యావరణంలోని ఆక్సిజన్ స్థాయిలను పునరుద్ధరించడంలో చెట్ల ప్రాముఖ్యతను వివరించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హరితహారం కార్యక్రమం ప్రేరణ అని అన్నారు.

ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇనిషియేటివ్‌ తెలంగాణలో అటవీ విస్తీర్ణాన్ని పెంచడంలో ఎంతో ప్రాధాన్యం కలిగి ఉందని కమిషనర్ తెలిపారు. అటవీ విస్తీర్ణం పెంపులో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని పేర్కొన్నారు. చెట్లను నాటడం యొక్క ప్రాముఖ్యత పర్యావరణంపై దాని ప్రభావం గురించి ప్రజలకు ఖచ్చితంగా ప్రచారం చేయడం, అవగాహన కల్పించడం అవసరం అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఎలైట్ ఫారెస్ట్రేషన్ ప్రాజెక్ట్ చైర్మన్ ఆర్టీఎన్. హిమాన్షు గుప్తా, అధ్యక్షుడు ఆర్టీఎన్ రోహిత్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed