పరీక్షలు వాయిదా వేయాలని ఆందోళన

by Sridhar Babu |
పరీక్షలు వాయిదా వేయాలని ఆందోళన
X

దిశ, తిరుమలగిరి : పీజీ కళాశాలలో పరీక్షలు వాయిదా వేయాలని శనివారం విద్యార్థులు కాలేజీ గేటు ముందు బైఠాయించి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ ప్రతి సెమిస్టర్ కు మధ్య కనీసం మూడు నెలలైనా వ్యవధి ఉండాలని డిమాండ్ చేశారు. ఎంతో మంది ఉత్తమ ర్యాంకర్లు ఈ విధానం వల్ల పరీక్షలు ఫెయిల్ అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా పీజీ కళాశాలలో సౌకర్యాలు లేక అనేక అవస్థలు పడుతున్నామని అన్నారు. ఈ పరీక్షలు వాయిదా వేయకుంటే ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న తమ కలలు సాకారం కాకుండా విద్యార్థుల జీవితాలు ఆగమ్యగోచరంగా మారుతాయని ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యా సంవత్సరాన్ని త్వరతగతిన పూర్తి చేయాలనే ఉద్దేశంతో నిబంధనలకు విరుద్ధంగా పరీక్షలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. అధికారులు ఇచ్చిన హామీ నెరవేరకపోతే ఉద్యమం మళ్లీ మొదలవుతుందని హెచ్చరించారు. ముఖ్యంగా కళాశాలలో మంచినీటి సౌకర్యం సరైన భోజన వసతి సౌకర్యాలు లేవని ఆరోపించారు. కళాశాలలో వసతులు అరకొరగా ఉంటున్నాయని, ఈ విషయమై యాజమాన్యానికి తెలియజేసినప్పటికీ వారు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. కళాశాల ముందు విద్యార్థులు ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకున్న ఏసీపీ గోపాలకృష్ణ, పలువురు ఇన్ స్పెక్టర్ లు, విద్యాశాఖ అధికారులు తమ సిబ్బందితో చేరుకొని విద్యార్ధులను శాంతింపజేసే ప్రయత్నం చేశారు.

Advertisement
Next Story