జర్నలిస్టుల సంక్షేమానికి కృషి: ఎమెల్యే మైనంపల్లి

by Disha Web Desk 11 |
జర్నలిస్టుల సంక్షేమానికి కృషి: ఎమెల్యే మైనంపల్లి
X

దిశ, మల్కాజిగిరి: జర్నలిస్టుల సంక్షేమానికి తన వంతుగా కృషి చేస్తానని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పేర్కొన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాయంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పనిచేస్తున్నా జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, డబుల్ బెడ్ రూం ఇండ్ల కేటాయింపు, ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు స్థలం కేటాయించి, హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పించాలని జర్నలిస్టు సంఘాలు ఎమ్మెల్యేకు వినతి పత్రాన్ని అందజేశారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే జర్నలిస్టుల సంక్షేమానికి తన వంతు సహాకారం అందిస్తామన్నారు. ప్రెస్ క్లబ్ ఏర్పాటు, డబుల్ బెడ్ రూం ఇండ్లు, జర్నలిస్టు కుంటుంబాలకు హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పించేందుకు కృషి చేస్తానని హామి ఇచ్చారు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే మల్కాజిగిరి సర్కిల్ అధ్యక్షుడు విల్సన్, ప్రధాన కార్యదర్శి గిరి గౌడ్, ఎలక్ర్టానిక్ మీడియా ప్రెసిడెంట్ విశాల్, మాజీ ప్రెసిడెంట్ సంఘమేష్ తదితరులు పాల్గొన్నారు.

Next Story