ధరలకు రెక్కలు ..మోతిచూర్ లడ్డుకు జైకొట్టిన నగర వాసులు

by Disha Web Desk 8 |
ధరలకు రెక్కలు ..మోతిచూర్ లడ్డుకు జైకొట్టిన నగర వాసులు
X

దిశ, రాచకొండ : వినాయక చవితి పండుగ సందర్భంగా హైదరాబాద్ లో మోతిచూర్ లడ్డు కి ప్రత్యేక క్రేజ్ దక్కింది. ఇంట్లో పెట్టుకుని వినాయకుడు నుంచి మండపం లో కొలువైన గణపతి విగ్రహం దగ్గర మోతీ చూర్ లడ్డుకు ప్రత్యేక స్థానం లభించింది. దీంతో ఈ లడ్డు ధరకు రెక్కలు వచ్చాయి. సింగల్ పిఎస్ నుంచి కేజీ వరకు సాధారణ రోజుల కన్నా ఈ రోజు ధరలను డబల్ నుంచి ట్రిపుల్ రేట్ ల వరకు మిఠాయి దుకాణదారులు అమాంతంగా పెంచేశారు. కొన్ని బ్రాండెడ్ స్వీట్ షాపుల నిర్వాహకులు కేజీ ధరను వెయ్యి దాటించారు. ఇలా నగర వాసులు గణేష్ భగవాన్ కు ప్రీతి పరమైన లడ్డుగా భావించి ధరలు పెరిగినా మోతిచూర్ లడ్డుకు జై కొట్టారు. నగరంలో సోమవారం వినాయక చవితి పండుగ సందర్భంగా వేలాది కిలోల మోతిచూర్ లడ్డును విక్రయించారు.


Next Story

Most Viewed