ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం : ఎమ్మెల్యే కృష్ణారావు

by Disha Web Desk 15 |
ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం : ఎమ్మెల్యే కృష్ణారావు
X

దిశ,కూకట్​పల్లి : కూకట్​పల్లి నియోజకవర్గ ప్రజలకు ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. నియోజకవర్గం పరిధికి చెందిన 52 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మంగళవారం క్యాంపు కార్యాలయంలో కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్​ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ నిరుపేద ఆడబిడ్డల పెళ్లిలకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్​లు జూపల్లి సత్యనారాయణ, పగుడాల శిరీష బాబురావు, సబీహ బేగం, పండాల సతీష్​ గౌడ్, మాజీ కార్పొరేటర్​ తూము శ్రావణ్ కుమార్​ పాల్గొన్నారు.


Next Story