భారీ ఆధిక్యం దిశగా వివేకానంద

by Disha Web Desk 23 |
భారీ ఆధిక్యం దిశగా వివేకానంద
X

దిదిశ,పేట్ బషీరాబాద్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి కేపీ వివేకానంద భారీ ఆధిక్యం దిశగా దూసుకు వెళ్తున్నారు. 2018 శాసనసభ ఎన్నికల్లో ఆయన సమీప ప్రత్యర్థి అయిన కూన శ్రీశైలం గౌడ్ పై 41 వేల 500 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ప్రస్తుతం జరుగుతున్న కౌంటింగ్ లో ఆయన మొదటి రౌండ్ నుంచి ముందంజలో ఉండటమే కాకుండా 12వ రౌండ్ వచ్చేసరికి గతంలో ఆయన సాధించిన మెజారిటీ మార్కును దాటారు. 12వ రౌండ్ లో నే ఆయనకు 42 వేల 614 ఓట్లతో ముందంజలో ఉండి హవా చూపిస్తున్నారు. 15వ రౌండ్ ముగిసేసరికి కెపి వివేకానంద 60 వేల 275 ఓట్లతో ప్రథమ స్థానంలో కొనసాగుతున్నారు.Next Story

Most Viewed