బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన ఉప్పల్ ఎమ్మెల్యే..

by Disha Web Desk 21 |
బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన ఉప్పల్ ఎమ్మెల్యే..
X

దిశ, నాచారం : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు.. ప్రతి ఏడాది బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ఆడపడుచులు అందరికీ ఇంట్లో పెద్దకొడుకుగా బతుకమ్మ చీరలను పంపిణీ చేశారని ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి తెలిపారు. ఉప్పల్ నియోజకవర్గంలోని మీర్పేట్ హెచ్. బి .కాలనీ డివిజన్ వార్డు కార్యాలయంలో ప్రజలకు బతుకమ్మ చీరలను స్థానిక కార్పొరేటర్ జర్రిపోతుల ప్రభుదాసుతో కలిసి పంపిణీ చేశారు. ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, కార్పొరేటర్ ప్రభుదాస్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాప్రా మున్సిపల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శంకర్, ప్రాజెక్ట్ ఆఫీసర్ రమాదేవి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హరిలాల్, డి ఈ రూప, స్థానిక కార్పొరేటర్ జేరిపోతుల ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ గుండారపు శ్రీనివాస్ రెడ్డి, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు జనుంపల్లీ వెంకటేశ్వర్ రెడ్డి, గరిక సుధాకర్, కాటేపల్లి రవీందర్ రెడ్డి, పిట్టల నరేష్ ముదిరాజ్, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, స్థానిక కాలనీవాసులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.


Next Story