విషాదం.. మద్యం మత్తులో తండ్రి.. శవాలుగా మారిన పిల్లలు

by Disha Web |
విషాదం.. మద్యం మత్తులో తండ్రి.. శవాలుగా మారిన పిల్లలు
X

దిశ, జవహర్ నగర్: జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. మల్కారం చెరువు వద్ద ఈత కొట్టేందుకు చెరువులోకి దిగిన ఇద్దరు పిల్లలకు సరిగ్గా ఈత రాకపోవడంతో చెరువులో పడి మృతి చెందగా, మరో పిల్లాడిని మెరుగైన చికిత్స నిమిత్తం పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఫరార్ నగర్‌కి చెందిన అయాన్,అల్తాఫ్‌లను తండ్రి రహీం వెంటబెట్టుకుని మల్కారం చెరువు వద్దకు వచ్చారు. అక్కడ చెరువులో ఆడుకుంటున్న పిల్లలు, ఈతరాకపోవడంతో అక్కడే మునిగిపోయారు. కాగా, ఘటనా స్థలంలో రహీమ్ ఉన్నప్పటికీ అతను మద్యం మత్తులో ఉన్న కారణంగా పిల్లలను గమనింలేదు. ఇక ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు వెలికితీశారు. ఇద్దరు పిల్లలు మృతి చెందడంతో ఆ గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Next Story