మల్కాజిగిరి బీఆర్ఎస్ నాయకులకు బెదిరింపు కాల్స్...

by Disha Web Desk 23 |
మల్కాజిగిరి బీఆర్ఎస్ నాయకులకు బెదిరింపు కాల్స్...
X

దిశ, మల్కాజిగిరి: మల్కాజిగిరి నియోజకవర్గంలోని బీఆర్ఎస్ ముఖ్య నాయకులకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ ను కలిసి ఫిర్యాదు చేశారు. గత రెండు రోజులుగా నియోజకవర్గంలోని నాయకులకు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఫోన్ నుంచి బెదిరింపు కాల్స్ రావటంతో నాయకులు ఆందోళన చెందారు. అయితే కావాలనే కొందరు సాంకేతిక పరిజ్ణానాన్నివినియోగించిస్తూ బెదిరింపు కాల్స్ చేస్తున్నారంటూ , మల్కాజిగిరి, నేరేడ్మెట్, అల్వాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

కాల్స్ ఎక్కువగా అల్వాల్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి, నేరేడ్ మెట్ కార్పొరేటర్ భర్త ఉపేందర్ రెడ్డి, గౌతంనగర్ కార్పొరేటర్ భర్త రాము యాదవ్ , మల్కాజిగిరి మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ ఇతర నాయకులకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే అనుచరులే ఇలాంటి బెదిరింపు కాల్స్ కు పాల్పడుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో శుక్రవారం ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి నాయకులతో కలిసి రాచకొండ సీపీ చౌహన్ ను కలిసి ఫిర్యాదు చేశారు.

Next Story

Most Viewed