- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎన్టీఆర్ విగ్రహాన్ని అవమానించిన వారిని శిక్షించాలి..
by Kodari Anjali |
ఎన్టీఆర్ విగ్రహాన్ని అవమానించిన వారిని శిక్షించాలని టీడీపీ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ అడ హక్ కమిటీ సభ్యుడు డిమాండ్ చేస్తున్నారు.

X
దిశ, ఘట్కేసర్: నల్గొండ పట్టణంలోని హైదరాబాదు రోడ్లో తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ సీఎం, దిగంవత స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని పెట్రోల్ పోసి దహనం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని తెలుగుదేశం పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ అడ హక్ కమిటీ సభ్యుడు వేముల సంజీవ గౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన పార్టీ సీనియర్ నాయకులు సామల జగన్మోహన్ రెడ్డి, పాటి సురేందర్ రెడ్డి, శిష్ట సూర్యనారాయణ రావులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని దేశ నలుమూలనకు చాటిచెప్పిన మహానేత విగ్రహాన్ని ధ్వంసం చేయడం పిరికి చర్యగా అభివర్ణించారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Next Story






