నిబంధనలు పాటించని విద్యాసంస్థలపై చర్యలు తీసుకోండి..

by Kodari Anjali |

విద్యాసంస్థల సమస్యలపై ఎంఈఓకు ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి అన్వర్ వినతిపత్రం అందజేశారు.

నిబంధనలు పాటించని విద్యాసంస్థలపై చర్యలు తీసుకోండి..
X

దిశ, మేడిపల్లి: మేడిపల్లి మండలంలో ప్రభుత్వ విద్యా రంగం అనేక సమస్యలతో సతమతమవుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత, మౌలిక వసతుల లోపం, తాగునీరు, మరుగుదొడ్లు, ఫర్నిచర్ వంటి సౌకర్యాల కొరత విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతోందని, అందువల్ల ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని, అలాగే ప్రైవేట్ మరియు కార్పొరేట్ విద్యాసంస్థలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తూ, పుస్తకాలు, యూనిఫాం, బస్సు ఫీజులు తదితర పేర్లతో అధిక మొత్తాలు వసూలు చేయడం ఆందోళనకర విషయమని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి అన్వర్ అన్నారు.

నిబంధనలు పాటించని విద్యాసంస్థల గుర్తింపును

ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి, ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని, ప్రైవేట్ మరియు కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజులను ప్రభుత్వ నియమాల ప్రకారం నియంత్రించాలన్నారు. అనుమతి లేకుండా అధిక ఫీజులు వసూలు చేస్తున్న విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు .ప్రభుత్వ నిబంధనలు పాటించని విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేసే చర్యలు చేపట్టి, విద్యార్థులు, తల్లిదండ్రులపై ఆర్థిక భారం తగ్గించే విధంగా చర్యలు తీసుకుని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పై సమస్యలపై వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని మేడ్చల్ జిల్లా కార్యదర్శి, ఎండీ అన్వర్, మేడ్చల్ జిల్లా ఉపాధ్యాయలు హరీష్, జిల్లా నాయకులు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Next Story