- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
వేధింపులకు గురి చేస్తే కఠిన చర్యలు : రాచకొండ సీపీ
దిశ, మల్కాజిగిరి : బాలికలను, మహిళలను వేధించే పోకిరీలను రాచకొండ షీ టీమ్స్ పోలీసులు వదిలిపెట్టే ప్రసక్తి లేదని, మహిళలు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని రాచకొండ సీపీ జి.సుధీర్ బాబు తెలిపారు. బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, స్కూళ్లు, కాలేజీలు, కూరగాయల మార్కెట్లు, బహిరంగ ప్రదేశాలలో మఫ్టీలో తిరుగుతూ షీ టీమ్స్ డెకాయ్ ఆపరేషన్లు చేస్తున్నారని, బాలికలను, మహిళలనువెంబడించే,వేధించే పోకిరీల చేష్టలను సాక్ష్యాధారాలతో సహా పట్టుకొని న్యాయస్థానంలో హాజరు పరుస్తూ , వారిని,వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇస్తున్నారన్నారు.
షీ టీమ్స్ రాచకొండ పరిధి ఏరియాలలో డెకాయ్ ఆపరేషన్స్ నిర్వహించి, గణేష్ మండపాల వద్ద, గణేష్ నిమజ్జనం చెరువుల వద్ద, రోడ్డు మీద వెళ్ళుతున్న మహిళలను, ఆడపిల్లలను వేదిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్న 268 మంది పోకిరీలను అదుపులోకి తీసుకొని వారిపై కేసులు నమోదు చేసి, వారికి ఎల్‌బి నగర్ ఉమెన్ సేఫ్టీ వింగ్ కార్యాలయంలో కౌన్సిలర్స్ తో వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. గత నెల 1వ తేది నుండి 30 వరకు 343 పిర్యాదులు అందినాయన్నారు. వాటిలో ఫోన్ల ద్వారా వేదించినవి -69, సోషల్ మీడియా యాప్ ద్వారా వేదించినవి- 91, నేరుగా వేదించినవి –183 కేసులనీ వాటిలో క్రిమినల్ కేసులు-11 , పెట్టి కేసులు- 107, 174 మందికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని విమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ ఉషా విశ్వనాథ్ తెలిపారు.