క్రీడలు మానసికోల్లాసానికి దోహదం

by Sridhar Babu |
క్రీడలు మానసికోల్లాసానికి దోహదం
X

దిశ, మేడ్చల్ బ్యూరో : క్రీడలు మానసికోల్లాసానికి దోహదపడతాయని మేడ్చల్ జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ రఘునాథ స్వామి అన్నారు. బండ్లగూడలోని శ్రీ స్వామినారాయణ గురుకుల ఇంటర్నేషనల్ స్కూల్ లో శనివారం గురుకుల ఒలింపిక్స్ గ్రాండ్ ఫినాలే‌ పేరిట గురుకుల ఒలింపిక్స్ గ్రాండ్ స్పోర్ట్స్ ఫియెస్టా ఫైనల్ పోటీలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రఘునాథ స్వామి విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మనకు సహనాన్ని, సమర్థతను, ప్రతిదానికి ధైర్యంగా ఎదుర్కొనే తత్వాన్ని నేర్పుతాయన్నారు. ఓటమి కూడా విజయానికి దారి చూపే మెట్టు అని తెలిపారు. విద్యార్థులు న్యూట్రిషస్ ఆహారం తీసుకోవడం, క్రీడలు లేదా యోగా వంటి సాధారణ శారీరక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని సూచించారు. ముఖ్యంగా సరిపడా నిద్ర పొందడం అనేవి ఆరోగ్యానికి మేలు చేస్తాయన్నారు.

Advertisement

Next Story

Most Viewed