నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో విచ్చలవిడిగా స్పా సెంటర్లు..

by Kalyani |
నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో విచ్చలవిడిగా స్పా సెంటర్లు..
X

దిశ, ఉప్పల్: హైదరాబాద్ లో స్పా సెంటర్ల పై పోలీస్ లు ఉక్కుపాదం మోపుతున్నారు. అక్రమంగా స్పా సెంటర్లు పెట్టి నియమనిబంధనలు పాటించకుండా మసాజ్ చేస్తున్నారు. వారిపై హైదరాబాద్ పోలీసులు తనిఖీలు చేపట్టి అరెస్ట్ చేసి స్పా సెంటర్లను సీజ్ చేస్తున్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధి నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో విచ్చలవిడిగా స్పా సెంటర్లు వెలుస్తున్నాయి. పట్టించుకునే నాధుడే లేరని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హబ్సిగూడ సిగ్నల్ వద్ద, మల్లాపూర్ మెయిన్ రోడ్డు లో బ్యూటీ పార్లర్ పేరుతో బోర్డులు పెట్టి లోపల మాత్రం మసాజ్ సెంటర్లు నిర్వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. బయట పేరుకు మాత్రమే బ్యూటీ పార్లర్ లోపట నడిచేది మొత్తం మసాజ్ అని కొందరు వ్యభిచారమని మరికొందరు ఆరోపిస్తున్నారు. నాచారం పోలీస్ స్టేషన్ పక్కనే ఒక బిల్డింగ్ లో ఎలాంటి బోర్డు పెట్టకుండా స్పా సెంటర్ విచ్చలవిడిగా నిర్వహిస్తున్నా కూడా పోలీసులు మాత్రం పట్టించుకోవడం లేదని అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీస్ స్టేషన్ పక్కకు స్పా సెంటర్ నడుస్తున్నా కూడా పోలీసులు ఎందుకు పట్టించుకోవడంలేదని పలువురు మండిపడుతున్నారు. ఎలాంటి పర్మిషన్ లేకుండా నియమ నిబంధనలు పాటించకుండా స్పా సెంటర్ ఎలా నడిపిస్తున్నారని, పోలీసులు చూసి చూడనట్టు ఎందుకు ఉంటున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా పోలీస్ అధికారులు స్పా సెంటర్ పై చర్యలు తీసుకొని సెంటర్లు నిర్వహిస్తున్న వారిపై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.



Next Story

Most Viewed