సోనియా గాంధీ ప్రకటించిన ఆరు పథకాలను అమలు చేస్తారు : వజ్రేష్ యాదవ్

by Aamani |
సోనియా గాంధీ ప్రకటించిన ఆరు పథకాలను అమలు చేస్తారు : వజ్రేష్ యాదవ్
X

దిశ, దమ్మాయిగూడ: తెలంగాణ తల్లి సోనియా గాంధీ ప్రకటించిన ఆరు పథకాలను గడపగడపకు తీసుకెళ్లాలని టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు. సోనియా గాంధీ ప్రకటించిన ఆరు సంక్షేమ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు దమ్మాయిగూడ రోజ్ గార్డెన్ నుండి నాగారం చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఇక్కడి ప్రజల ఆకాంక్షలు, బ్రతుకులు మారుతాయని భావించి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్లు గడిచిన ప్రజల అవస్థలు తగ్గలేదని ఆయన అన్నారు. రోజురోజుకు ధరలు మరింత పెరుగుతున్నాయని, తెలంగాణ ప్రజల అవస్థలను గుర్తించి వారికి కొంత ఉపశమనాన్ని ఇచ్చేందుకు తెలంగాణ తల్లి సోనియా గాంధీ విజయభేరి సభ ద్వారా ప్రకటించిన ఆరు పథకాలను మేడ్చల్ నియోజకవర్గంలోని గడపగడపకు తీసుకెళ్తామని టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మేడ్చల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ తోటకూర వజ్రెష్ యాదవ్ వివరించారు. సమావేశంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

Next Story

Most Viewed