సార్ మాకు కనిపించడం లేదు.. కుత్బుల్లాపూర్ ఎమ్మార్వోపై మిస్సింగ్ కంప్లైంట్

by Aamani |
సార్ మాకు కనిపించడం లేదు.. కుత్బుల్లాపూర్ ఎమ్మార్వోపై మిస్సింగ్ కంప్లైంట్
X

దిశ,కుత్బుల్లాపూర్ : సార్ మాకు కనిపించడం లేదు వెతికి పెట్టండి అంటూ జగద్గిరిగుట్ట పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్లితే కుత్బుల్లాపూర్ ఎమ్మార్వో అబ్దుల్ రెహమాన్ గత కొద్ది రోజుల నుంచి కార్యాలయంకు రావడం లేదు. దీంతో సర్టిఫికెట్ కోసం పౌరులు రోజుల తరబడి కుత్బుల్లాపూర్ ఎమ్మార్వో ఆఫీస్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. దరఖాస్తు దారులు చేసేది లేక కుత్బుల్లాపూర్ ఎమ్మార్వో కనిపించడం లేదు అంటూ జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. గత రెండు మూడు నెలలుగా ఎప్పుడు వెళ్లిన ఎమ్మార్వో కార్యాలయంలో ఆయన అందుబాటులో ఉండటం లేదని, ఒకసారి సెలవు పై ఉన్నారు అంటారు, మరోసారి ఎలక్షన్ డ్యూటీ అని అంటూ సిబ్బంది సమాధానం చెబుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కార్యాలయంలో ఎమ్మార్వో అందుబాటులో ఉండకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, స్కూల్స్ కాలేజీలు ప్రారంభమైన నేపథ్యంలో వారికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు జారీలో తీవ్ర ఆలస్యం అవుతుందని ఆరోపించారు.వెంటనే తహసీల్దార్ ను వెతికిపెట్టాలని పోలీసులను బ్రతిమిలాడారు.

Next Story

Most Viewed