- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
డాలర్ డ్రీమ్స్ చూపించి... రైల్వే ఆఫీసర్‌కు లక్షల్లో టోపీ…
దిశ, రాచకొండ : కొరియర్ మూట లో డాలర్ నోట్ల కట్టలు వస్తున్నాయని ఓ రైల్వే ఉన్నతాధికారి ని సైబర్ నేరగాళ్ళు బురిడీ కొట్టించారు . మల్కాజిగిరి ప్రాంతం లో ఓ రైల్వే ఉన్నతాధికారి (59) కి ఇటీవల వాట్సాప్ లో ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ లో మాట్లాడిన వ్యక్తి తాను అమెరికా లో డాక్టర్ గా పని చేస్తున్నాను ఇండియా లో ఆస్తులు కొనాలని అనుకుంటున్నాను తెలిసిన వారి ద్వారా మీ నెంబర్ దొరికింది. అందుకే మీకు ఫోన్ చేశాను అని మార్క్ విలియమ్స్ గా పరిచయం చేసుకున్నాడు. ఇలా పలు మార్లు రైల్వే ఉన్నతాధికారి తో మాట్లాడిన విలియమ్స్ ఆస్తులు కొనుగోలు చేయడానికి డబ్బులు పంపడానికి టెక్నికల్ సమస్యలు వస్తున్నాయి అందుకే డాలర్ లను కొరియర్ ప్యాకెట్ లో పంపుతున్నాని చెప్పాడు.
రెండు రోజుల తర్వాత ఢిల్లీ కస్టమ్స్ అధికారులు మాట్లాడుతున్నామాని చెప్పి మీకు కొరియర్ లో డాలర్స్ వచ్చాయని దానికి టాక్స్ కట్టాలని లేదంటే కేసు అవుతుందని హెచ్చరించారు. దీంతో రైల్వే ఉన్నతాధికారి 80 వేలు పంపాడు. వారి మాయ మాటలకు భయపడి మొత్తం 6.30 లక్షలు పంపాడు. ఇంకా డబ్బులు కావాలని అడుగుతుండడం తో మోసపోయానని రైల్వే ఉన్నతాధికారి రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు పై కేసు ను నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయినట్లు గుర్తిస్తే వెంటనే 1930 కు ఫోన్ చేయాలని పోలీసు అధికారులు కోరుతున్నారు.