బహుజనుల విముక్తి కోసం పోరాడిన యోధుడు సర్దార్ పాపన్న గౌడ్: మంత్రి మల్లారెడ్డి

by Disha Web Desk 19 |
బహుజనుల విముక్తి కోసం పోరాడిన యోధుడు సర్దార్ పాపన్న గౌడ్: మంత్రి మల్లారెడ్డి
X

దిశ, కంటోన్మెంట్/బోయిన్ పల్లి: తెలంగాణ ప్రాంత బహుజన సామాజిక వర్గాల విముక్తి కోసం పోరాడిన యోధులు సర్దార్ పాపన్న గౌడ్ అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గురువారం సర్దార్ సర్వాయి పాపన్న 372 వ జయంతి ఉత్సవాలు న్యూ బోయిన్ పల్లిలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మంత్రి మల్లారెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మల్లారెడ్డి మాట్లాడుతూ.. బడుగుల కోసం వీరోచిత పోరాటం చేసిన పాపన్న స్పూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు.

తెలంగాణ స్టేట్ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ క్రిశాంక్ మాట్లాడుతూ.. నాడు మొగలాయిల దౌర్జన్యాలకు ధీటుగా నిలబడి అనితరసాధ్యమైన పోరాటం ద్వారా తెలంగాణ పౌర సమాజంలో ప్రతి ఒక్కరిలో పోరాట స్ఫూర్తిని రగిల్చినటువంటి వీరుడు పాపన్న గౌడ్ అని గుర్తు చేశారు. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ చార్జీ మర్రి రాజశేఖర్ రెడ్డి, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి, మాజీ సభ్యుడు పాండు యాదవ్ తదితరులు పాపన్న విగ్రహానికి పూల మాలలు వేసి, నివాళులు అర్పించారు.

నేడు తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత వాడవాడలా గ్రామగ్రామాన ఇటువంటి మహనీయుల విగ్రహాలను ప్రతిష్టించడం తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా భావించవచ్చని పలువురు అన్నారు. పాపన్న కేవలం గౌడ జాతికే కాదు తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి తెలంగాణ బిడ్డకు ఒక స్ఫూర్తి ప్రదాత అని, కుల మత సహనానికి, ఇటువంటి మహనీయుల జయంతి వేడుకలు ఖచ్చితంగా దోహదపడతాయని అన్నారు. క్రిశాంక్‌ను గౌడ కులస్థులు స్థలం ప్రభుత్వం నుండి ఇప్పించాలని కోరగా.. ముఖ్యమంత్రి కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ‌ఆర్ దగ్గరికి ఈ ప్రతిపాదన తీసుకెళ్లి స్థలం వచ్చే విధంగా కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో అనంద్ గౌడ్, టింకు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed