- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
ముగిసిన సంక్రాంతి సంబరాలు

దిశ, మేడ్చల్ బ్యూరో : మేడ్చల్ నియోజకవర్గం తూంకుంట మున్సిపల్ దేవరయాంజాల్ గ్రామంలోని రిక్రియా ఫర్నీచర్ స్టూడియో వద్ద టీపీసీసీ సెక్రటరీ పీసరి మహిపాల్ రెడ్డి, సోదరులు పీసరి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ఘనంగా ముగ్గుల పోటీలు, కైట్ ఫెస్టివల్ (పతంగుల పండుగ), సంగీత విభావరి (లైవ్ మ్యూజిక్ ప్రోగ్రాం) కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. బుధవారం ముగ్గుల పోటీలలో విజేతలకు బహుమతి ప్రదానోత్సవం జరిగింది.
బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ , మల్కాజ్ గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ లు పాల్గొన్నారు. ఆనందోత్సాహాల నడుమ విజేతలకు బహుమతులను అతిథులు పొన్నం ప్రభాకర్ గౌడ్ , ఈటెల రాజేందర్ లు అందజేశారు. బహుమతుల ప్రదానోత్సవం అనంతరం కోలాహలంగా సంగీత విభావరి (లైవ్ మ్యూజిక్ ప్రోగ్రాం) జరిగింది. లైవ్ మ్యూజిక్ ఆద్యంతం ఆకట్టుకుంది.