ఎస్కలేటర్‌లకు మోక్షం ఎప్పుడో..

by Disha Web Desk 23 |
ఎస్కలేటర్‌లకు మోక్షం ఎప్పుడో..
X

దిశ,ఉప్పల్: అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్టు చందంగా ఉంది మన ఉప్పల్ స్కై వాక్ పరిస్థితి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఐటీ శాఖ మంత్రి కేటిఆర్ వచ్చి ప్రారంభించిన విషయం తెలిసిందే. నెలలు గడుస్తున్నా ఇంకా పాదాచారులకు స్కై వాక్ పూర్తిగా అందుబాటులోకి రాలేదని మడ్డిపడుతున్నారు.ప్రారంభినప్పటి నుంచి ఏదో ఒక సమస్య తలెత్తుతుంది. ప్రారంభ దశలో ఎస్కలేటర్, లిఫ్ట్ లు సరిగా పనిచేయకపోవడం, లిఫ్ట్ లో ఎక్కిన తర్వాత మధ్యలో ఆగిపోవడం లాంటివి సమస్యలు వచ్చినప్పటికీ కాంట్రాక్టర్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించాడు.

మొదట ఉప్పల్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే దారిలో మాత్రం ఎస్కలేటర్ ప్రారంభించారు. మిగతా చోట్లలో ఎస్కలేటర్ ఏర్పాటు చేశారు కానీ ఇంకా ప్రారంభించలేదు.స్కై వాక్ కు మొత్తం 4 ఎస్కలెటర్స్ అందుబాటులో ఉన్నప్పటికీ ప్రస్తుతం మాత్రం ఒక్క ఎస్కాలెటర్ మాత్రమే నడుస్తుంది.లిఫ్ట్ -1, లిఫ్ట్ -4, లిఫ్ట్ -5 దగ్గర ఉన్న ఎస్కలేటర్లు ఇంకా ప్రారంభం చేయలేదు. అధికారులు చొరవ తీసుకొని మిగతా ఎస్కాలెటర్లను కూడా త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని పాదాచారులు,ప్రజలు హెచ్ఎండిఏ అధికారులను,కాంట్రాక్టర్ ని కోరుతున్నారు.

Next Story

Most Viewed