ప్రయాణికుడిపై ఆర్టీసీ డ్రైవర్ దాడి

by Aamani |
ప్రయాణికుడిపై ఆర్టీసీ డ్రైవర్ దాడి
X

దిశ,మేడ్చల్ టౌన్: ప్రయాణికుడిపై ఆర్టీసీ డ్రైవర్ చేయి చేసుకున్న సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం మంగళవారం మేడ్చల్ డిపో కు చెందిన (ts 10 uc 9847)ముందు ప్రయాణికుడు రాజలింగం రామాయంపేట వెళ్లడానికి ఆర్టీసీ బస్సు కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతలోనే మేడ్చల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు రామాయంపేట వెళ్తుండటం ప్రయాణికుడు చెయ్యెత్తి బస్సును ఆపాడు. బస్సు డ్రైవర్ ఆపకపోవడంతో ఆగ్రహంతో ప్రయాణికుడు తిట్టడంతో బస్సు డ్రైవర్ పక్కకు ఆపి రాజలింగం తలపై కర్రతో బాదాడు. దీంతో ప్రయాణికుడికి తల పగిలి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ప్రయాణికుడు స్థానిక పోలీసులు సమాచారం అందించారు.

Next Story

Most Viewed