రూ. 90 లక్షల అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే

by Disha web |
రూ. 90 లక్షల అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే
X

దిశ, కూకట్​పల్లి: మూసాపేట్​ డివిజన్​ పరిధిలో రూ. 90 లక్షల అంచనా వ్యయంతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మూసాపేట్​ డివిజన్​లో 98 శాతం అభివృద్ధి పనులు పూర్తయ్యాయని అన్నారు. పెండింగ్ లో ఉన్న పనులను త్వరలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్​ తూము శ్రావణ్​ కుమార్​, డీఈ శ్రీదేవి, సీనియర్ నాయకులు సీహెచ్. సత్యనారాయణ, డివిజన్ అధ్యక్షుడు అంబటి శ్రీనివాస్, నాగుల సత్యం, జిల్లా గోపాల్, తిరుపతి, ఉదయ్, మోహన్ రెడ్డి, రుద్రగౌడ్ తదితరులు పాల్గొన్నారు.


Next Story