రాయల్‌గా భారీ అక్రమ షెడ్డు..అనుమతులు ఒక రకంగా.. నిర్మాణం మరొక రకంగా

by Aamani |
రాయల్‌గా భారీ అక్రమ షెడ్డు..అనుమతులు ఒక రకంగా.. నిర్మాణం మరొక రకంగా
X

దిశ,పేట్ బషీరాబాద్: రోజురోజుకు విస్తరిస్తున్న నగరంలో పోటాపోటీగా షాపింగ్ మాల్స్ వెలుస్తున్నాయి. అత్యంత డిమాండ్ ఉన్న ప్రధాన రహదారుల వెంబడి తళుకుబెళుకు లైటింగ్ లతో ఈ మాల్స్ వెలుస్తున్నాయి. అయితే చాలావరకు షాపింగ్ మాల్స్ నిర్మాణదారులు అనుమతులు ఒక రకంగా తీసుకొని నిబంధనలు విరుద్ధంగా నిర్మాణాలు చేసుకుంటున్నారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ జీడిమెట్ల డివిజన్ పెట్ బషీరాబాద్ సర్వే నెంబర్ 25 బై వన్ లో “రాయ్ చాందిని” షాపింగ్ మాల్ నిర్మాణం కూడా ఇదే విధంగా జరుగుతుంది.


అనుమతులు తీసుకుంది ఒక రకంగా..

పెట్ బషీరాబాద్ సర్వే నెంబర్ 25 బై ఒకటి పోలీస్ స్టేషన్ సర్వీస్ రోడ్డులో రాయి చాందిని షాపింగ్ మాల్ నిర్మాణం చేపట్టారు. 2020లో ఈ నిర్మాణానికి రెండు సెల్లర్స్, గ్రౌండ్ ప్లస్ ఫోర్ అనుమతులు తీసుకున్నారు. పూర్తి కమర్షియల్ పర్మిషన్ తీసుకున్న ఈ భవనం గ్రౌండ్ ఫ్లోర్ 4 వేల 844 m², అప్పర్ ఫ్లోర్స్ 14 వేల 937 m² చొప్పున నిర్మాణం చేయడానికి అనుమతులు పొందారు. దాదాపుగా మూడు సంవత్సరాల కాలంలో అనుకున్న విధంగానే నిర్మాణాన్ని పూర్తి చేశారు. కానీ…

5వంతస్తుగా భారీ షెడ్..

రాయి చాందిని షాపింగ్ మాల్ నిర్మాణం కోసం టు సెల్లార్స్ తో పాటుగా గ్రౌండ్ ప్లేస్ ఫోర్ అనుమతులు తీసుకున్న నిర్మాణదారులు షాపింగ్ మాల్ లో దాదాపుగా 4 వందలకు పైగా షాప్స్ ఏర్పాటుగా తీర్చిదిద్దారు. దీనిని 2023 ఏప్రిల్ నెలలో ప్రారంభించారు. ఇంతవరకు బాగానే ఉన్నా అనంతరం షాపింగ్ మాల్ భవనం పై ఐదవ అంతస్తుగా భారీ షెడ్డు నిర్మాణం చేశారు. ప్రస్తుతం ఈ షెడ్డు నిర్మాణం తుది మెరుగుల దశలో ఉన్నది. ఇంత భారీ షెడ్డు నిర్మాణం చేపడుతున్న నిర్మాణ సంస్థ జీహెచ్ఎంసీ నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోకుండానే అక్రమంగా షెడ్ పనులు పూర్తి చేసుకుంటుంది.

మార్టిగేజ్ రిలీజ్ తర్వాతనే..?

నిర్మాణ సమయంలో సంస్థ దాదాపుగా 2 వేల స్క్వేర్ మీటర్స్ వరకు మార్ట్ గేజ్ చేయడం జరిగింది. అనుమతులు ప్రకారంగా నిర్మాణ పనులు పూర్తి చేసిన అనంతరం మార్ట్ గేజ్ రిలీజ్ అయిన తర్వాతనే భవనంపై ఐదవ అంతస్తుగా భారీ షెడ్డు నిర్మాణం చేపట్టిందని చెబుతున్నారు. పూర్తి కమర్షియల్ బిల్డింగ్ పై అక్రమంగా ఎటువంటి అనుమతులు లేకుండా షెడ్డు నిర్మాణం చేపట్టడంపై టౌన్ ప్లానింగ్ అధికారులు ఇటువంటి చర్యలు తీసుకోలేదు. అసలు ఈ షాపింగ్ మాల్ పై అక్రమంగా షెడ్డు నిర్మాణం జరుగుతుంది అనే విషయం టౌన్ ప్లానింగ్ దృష్టికి వచ్చిందా..? అక్రమ నిర్మాణం దృష్టికి వచ్చిన మిన్నకుండిపోయారా..? అనే విషయం అధికారులే చెప్పాల్సి ఉంది.

Next Story

Most Viewed