ఇళ్ల పట్టాల పంపిణీకి విచ్చేసిన మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ..

by Disha Web Desk 11 |
ఇళ్ల పట్టాల పంపిణీకి విచ్చేసిన మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ..
X

దిశ, మేడిపల్లి: జీఓ నెం. 58 పథకంలో భాగంగా లబ్ధిదారులకు శాశ్వత ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమానికి వచ్చిన మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ తగలింది. వివరాలు ఇలా ఉన్నాయి. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బండి గార్డెన్ లో ప్రభుత్వ స్థలంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న నివాసాలకు వారికి పూర్తి హక్కు కల్పించేందుకు శాశ్వత ఇళ్ల పట్టాలు పంపిణీకి విచ్చేసిన మంత్రికి నిరసన సెగలు ఎదురయ్యాయి. గౌడ కులస్తులు అడ్డుకుని తమ భూమిలో గుడిసెలు వేసుకున్న వారికి పట్టాలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. వారికీ కూడా న్యాయం చేసే వెళ్తానని హామీ ఇవ్వటంతో అక్కడి నుంచి బాధితులు వెళ్లారు. ఆ తరువాత బోడుప్పల్, పీర్జాది గూడ మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన అర్హులైన సుమారు 509 మంది లబ్ధిదారులకు పట్టాల పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జీవో 58ప్రకారం పీర్జాదిగూడలో బోడుప్పల్ లో అర్హత పొందిన ప్రతి ఒక్కరికీ పట్టాలు అందజేస్తామని, ఇంకా ఎవరైనా ఉంటే కూడా ఏప్రిల్ లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. రాష్ట్రంలో ప్రభుత్వ భూములలో ఎంతమంది గుడిసెలు వేసుకున్నారో వారందరికీ కేసీఆర్ పట్టాలు ఇవ్వమన్నారని, సొంత ఇల్లు, కారు, ప్రభుత్వ ఉద్యోగం ఉండి కూడా ఎవరన్నా ఈ పట్టా తీసుకుంటే వారిపై 420 కేసు పెట్టాలన్నారు. ఒకటి కంటే ఎక్కువ ప్లాట్లు ఎవరైనా తీసుకొని ఉంటే వారిపై పీడీ యాక్ట్ కేసు పెట్టాలని పోలీసులకు సూచించారు.

దేశంలో ఎక్కడా అమలు కానీ పథకాలు మన రాష్ట్రంలోనే అమలావుతున్నాయని అన్నారు. బోడుప్పల్ లో వక్ఫ్ బాధితులకు న్యాయం చేసేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని చెప్పారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న కేసీఆర్ ను వచ్చే ఎన్నికల్లో మూడోసారి హ్యాట్రిక్ సీఎంని చేయాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బోడుప్పల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి, పీర్జాదిగూడ జక్కా వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed