- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
రాష్ట్రపతి నిలయం.. నాటి బ్రిటీష్ రెసిడెన్షీ హౌస్‌గా రాజ్ మహల్

దిశ ప్రతినిధి, మేడ్చల్ : నాలుగు శతాబ్దాల సుధీర్ఘ చరిత్ర కలిగిన అందమైన నగరం 'హైదరాబాద్'. ప్రపంచ ప్రఖ్యాతి కలిగిన చారిత్రాత్మక వారసత్వపు నిర్మాణాలు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలలో ఎన్నో ఉన్నాయి. ఈ నిర్మాణాలు అనాటి శిల్ప కళాకారుల నైపుణ్యానికి సాక్షంగా నిలవడంతో పాటు నాటి సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితి గతులకు అద్దంపట్టేలా ఉన్నాయి. ఇందులో ఒకటి సికింద్రాబాద్ బొల్లారంలోని అతిపురాతన భవనం నేటి రాష్ట్రపతి నిలయం.
రాజ్ మహల్ చరిత్ర
హైదరాబాద్ నిజాం నజీర్ ఉద్ దౌలా హయాంలో ఈ భవనం 1860లో నిర్మితమైంది. మొత్తం 90 ఎకరాల సువిశాల ప్రాంగణాన్ని ఒకే అంతస్థులో అద్భుతంగా నిర్మించారు. ఈ భవనాన్ని అప్పట్లో 'వైశ్రాయ్' లేదా 'రెసిడెన్సీ' హౌస్‌గా పిలిచేవారు. బ్రిటీష్ ప్రధాన సైనికాధికారి (బ్రిటీష్ రెసిడెంట్) ఇందులో నివాసం ఉండేవారు. దీని వల్లనే ఈ భవనాన్ని బ్రిటీష్ రెసిడెన్సీ హౌస్‌గా పిలిచేవారు. కాగా 1948లో హైదరాబాద్ సంస్థానం భారత్‌లో వీలినం అనంతరం రాష్ట్రపతి దక్షిణాది విడిది తాత్కలిక నివాసంగా వినియోగిస్తున్నారు.
నాటి నుంచి భారత రాష్ట్రపతులు శీతాకాల విడిదిలో కొన్ని రోజుల పాటు ఇక్కడే నివాసం ఉంటూ.. తమ కార్యకలాపాలు నిర్వహిస్తుంటారు. డైనింగ్ హాల్, మార్నింగ్ రూమ్, సినిమా హాల్ సహా మొత్తం 16 గదులున్న ప్రధాన భవానానికి కొద్ది దూరంలో వంట గది ఉంది. ఈ వంట గది నుంచి ప్రధాన భవనంలోని డైనింగ్ హాల్‌కు ఆహారాన్ని తీసుకువచ్చేందుకు సోరంగా మార్గం ఉంది. రాష్ట్రపతి ప్రధాన నివాస భవనంతోపాటు మరో 150 మంది సిబ్బంది ఉండేందుకు ప్రత్యేక వసతి సముదాయం కూడా ఉంది.
Also Read: హైదరాబాద్ హైకోర్టు.. నాలుగేళ్లు సాగిన నిర్మాణం..