నిబంధనలు ప్రజలకేనా.... పోలీసులకు కాదా...

by Disha Web Desk 20 |
నిబంధనలు ప్రజలకేనా.... పోలీసులకు కాదా...
X

దిశ, కూకట్​పల్లి : రాజ్యాంగం ద్వారా పుట్టిన చట్టాలు కేవలం సామాన్య ప్రజలే పాటించాలా, చట్టంలోని వారికి చట్టాలు, నిబంధనలు చుట్టాలేనా..? అధికారులు నిబంధనలను పాటించాల్సిన అవసరం లేదా...? కూకట్​పల్లి జాతీయ రహదారి పై నిబంధనలకు విరుద్ధంగా భారి రాళ్లతో ప్రయాణిస్తున్నాయంటు గురువారం అర్ధరాత్రి కూకట్​పల్లి పోలీసులు నాలుగు టిప్పర్​లను పట్టుకున్నారు.

ఇదిలా ఉంటే నిబంధనలు పాటించని టిప్పర్లను పట్టుకున్న పోలీసులు వాళ్లు పట్టుకున్న టిప్పర్లను ఏకంగా వేలాది మంది విద్యనభ్యసిస్తున్న ప్రభుత్వ డిగ్రి కళాశాల ప్రధాన గేటుకు ఎదురుగా, వందలాది ప్రయాణికులు ఆర్​టీసీ బస్సులో ప్రయాణించేందుకు నిలిచి ఉండే బస్టాప్​కు అడ్డంగా నిలిపారు. అంతే కాకుండా జాతీయ రహదారి పై ఫుట్​ పాత్​ పొడవున ఏకంగా నాలుగు భారి టిప్పర్​లను పార్క్​ చేశారు. గ్రేటర్​ హైదరాబాద్​లోని అత్యధిక ట్రాఫిక్, రద్ది ప్రాంతంగా కూకట్​పల్లి పేరు గాంచింది. ఎంతో రద్దిగా ఉండే కూకట్​పల్లి జాతీయ రహదారి పొడవున భారి టిప్పర్​లు అందులోని భారి బండరాళ్లు ప్రమాదకరంగా కనిపిస్తు ప్రయాణికులు, బాటసారులను భయ భ్రాంతులకు గురి చేస్తున్నాయి.



Next Story