రాఘవేంద్ర హోటల్ ముందు యదేఛ్చగా అక్రమపార్కింగ్..

by Disha Web Desk 20 |
రాఘవేంద్ర హోటల్ ముందు యదేఛ్చగా అక్రమపార్కింగ్..
X

దిశ, ఉప్పల్ : ఉప్పల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ పార్కింగ్ కు అడ్దూ, అదుపు లేకుండా పోయింది. హోటళ్లు, టిఫిన్‌ సెంటర్లు, బార్లు, రెస్టారెంట్లు, షాపింగ్‌ మాల్స్‌ ఇలా జనసందోహం ఎక్కువగా వచ్చిపోయే వ్యాపారాలకు పార్కింగ్‌ స్థలాలు తప్పనిసరిగా ఉండాలి. అలా ఉంటేనే వ్యాపారం చేసుకోవడానికి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఉప్పల్ ట్రాఫిక్ పోలీస్ అధికారులకు ఇవేమి కనిపించడం లేదు. సర్వే ఆఫ్ ఇండియా దగ్గర రాఘవేంద్ర హోటల్ ముందు అక్రమంగా రోడ్డు మీదనే పార్కింగ్‌లు చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోవడం లేదు. సామాన్య ప్రజలు తీవ్రఇబ్బందులు పడుతున్నారు. హోటల్ కు వచ్చేవారు రోడ్లమీద అక్రమ పార్కింగ్ చేసి లోపటికి వెళ్తున్నారు. దానివలన వాహనదారులు, పాదచారులు తీవ్రంగా ఇబ్బంది. ఎదుర్కొంటున్నామని ఆరోపిస్తున్నారు.

హోటల్ ముందు ఆక్రమ పార్కింగ్ చేసిన వాహనాలకు ఎప్పుడో ఒకసారి తూతూ మంత్రంగా చాలన్లు వేస్తున్నారు. తప్పితే ట్రాఫిక్ సమస్యను మాత్రం తీర్చడం లేదని ట్రాఫిక్ పోలిసుల పై విమర్శలు వెలువెత్తుతున్నాయి. నిత్యం అక్కడ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు చూసీచూడనట్లు వదిలేయడంతో నిత్యం ఉదయం, సాయంత్రం ట్రాఫిక్ జామ్ అవుతూనే ఉంటుంది. రాఘవేంద్ర హోటల్ కు పార్కింగ్‌ లేకపోయినా నడిరోడ్డు పై వాహనాలు నిలుపుతూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నా పోలీస్ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న హోటల్ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు కురిపిస్తున్నారు. రాఘవేంద్ర హోటల్ వద్దకు వచ్చే వాహనదారులు రోడ్డుపైనే అడ్డగోలుగా పార్కింగ్‌ చేస్తున్నా ట్రాఫిక్ పోలీసులు హోటల్ యజమాని పట్టించుకోకపోవడం వల్ల అక్కడ ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పటికైనా ట్రాఫిక్ పోలీస్ అధికారులు స్పందించి పార్కింగ్‌లు లేని వారి పై చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని వాహనదారులు ఆరోపిస్తున్నారు.


Next Story

Most Viewed