సమగ్ర సర్వేలో అధికారులు పారదర్శకంగా పర్యవేక్షించాలి : మల్కాజిగిరి ఎమ్మెల్యే

by Aamani |
సమగ్ర సర్వేలో అధికారులు పారదర్శకంగా పర్యవేక్షించాలి : మల్కాజిగిరి ఎమ్మెల్యే
X

దిశ, అల్వాల్: ప్రజల సామాజిక ఆర్థిక రాజకీయ అభివృద్దికై చేస్తున్న సర్వేలు కనుక సర్వే చేస్తున్న సిబ్బంది అధికారులు పారదర్శకంగా ఎలాంటి తప్పులు జరగకుండా నిర్వహించాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కోరారు. గురువారం అల్వాల్ డివిజన్ వెంకటాపురంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి తో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొని అధికారులకు సహకరించాలని కోరారు. సర్వేలో భాగంగా ఓ గృహానికి స్టిక్కర్ అతికించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ స్వామి, పీఓ. మదన్ మోహన్,స్థానిక నాయకులు కృష్ణ రెడ్డి, చరణ్ గిరి,సురేందర్ రెడ్డి, సునీత కృష్ణ రెడ్డి, పెంటా రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Next Story