మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడిగా రెండోసారి నందికంటి శ్రీధర్

by Dishanational2 |
మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడిగా రెండోసారి నందికంటి శ్రీధర్
X

దిశ ప్రతినిధి,మేడ్చల్ : మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నందికంటి శ్రీధర్‌కు రెండోసారి అవకాశం దక్కింది. శనివారం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెలంగాణ కాంగ్రెస్‌లో భారీ మార్పులు చేపట్టింది. రాష్ట్రంలోని 26 జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించింది. అయితే మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాకు మాత్రం ప్రస్తుత అధ్యక్షుడు నందికంటి శ్రీధర్‌నే కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో జిల్లా వ్యాప్తంగా పార్టీశ్రేణులు, నంది కంటి అభిమానులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.

అల్వాల్ యూత్ కాంగ్రెస్ నుంచి..

మల్కాజిగిరి నియోజకవర్గం, అల్వాల్ ప్రాంతానికి చెందిన నందికంటి శ్రీధర్ సుధీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. అల్వాల్ మున్సిపాలిటీ యూత్ ప్రెసిడెంట్‌గా తొలి పదవి చేపట్టిన శ్రీధర్ అంచెలంచెలుగా ఎదిగారు. ఆ తర్వాత రంగారెడ్డి ఉమ్మడి జిల్లా బీసీ సెల్ ప్రధాన్ కార్యదర్శి పనిచేశారు. 2000 వ సంవత్సరంలో అల్వాల్ మున్సిపాలిటీ కౌన్సిలర్‌‌గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2009లో జీహెచ్ఎంసీ కార్పొరేటర్‌గా పనిచేశారు. 2014లో మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తుండగా, జిల్లాల విభజనలో భాగంగా 2021లో మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ నియమితులయ్యారు. తాజాగా రెండోసారి పార్టీ అధిష్టానం శ్రీధర్ కే అవసకాశం కల్పించింది.

మరింత బాధ్యతగా పనిచేస్తా.. నందికంటి..

తనపై పూర్తి విశ్వాసంతో రెండోసారి జిల్లా అధ్యక్షుడిగా అధిష్టానం నియమించింది. దీంతో తనపై బాధ్యత మరింత పెరిగింది. పార్టీ తనపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరింత బాధ్యతయుతంగా పనిచేస్తా.. పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకువచ్చుందకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తా.. తనకు రెండోసారి అవకాశం కల్పించిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కి ఇతర అధిష్టాన పెద్దలకు కృతజ్ఠతలు.జిల్లాలో అందరికి కలుపుకొని పోయి పార్టీ పటిష్టతతకు కృషిచేస్తానని నంది కంటి శ్రీధర్ తెలియజేశారు.



Next Story

Most Viewed