హైదరాబాద్ పై మోడీ కన్ను పడింది: మంత్రి మల్లారెడ్డి

by Kalyani |
హైదరాబాద్ పై మోడీ కన్ను పడింది: మంత్రి మల్లారెడ్డి
X

దిశ, నాచారం: దేశంలో శరవేగంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ ను అడ్డుకోవడం కోసం ప్రధాని నరేంద్ర మోడీ కన్ను వేశారని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ఆరోపించారు. ఆదివారం నాచారం ఏఎన్ఆర్ గార్డెన్ లో ఉప్పల్ నియోజకవర్గ బీఆర్ఎస్ఆ త్మీయ సమ్మేళనం ఉప్పల్ శాసనసభ్యులు బేతి శుభాష్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి మల్లారెడ్డి, జిల్లా ఇంచార్జి రైతు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి హాజరై మాట్లాడారు.

ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ 75 సంవత్సరాల పాలనలో చేసిన అభివృద్ధి, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 7 సంవత్సరాలలో అభివృద్ధి చేశారాని కొనియాడారు. కేంద్రంలోని బీజేపీ నిత్యావసరాల ధరలను పెంచి పబ్లిక్ సెక్టార్ లను అమ్మకాలకు పెట్టారని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు దరిద్రపు, దివాల పార్టీలని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్నారు. కేటీఆర్ ప్రపంచంలోని అన్ని ప్రాంతాలు తిరిగి అధిక పెట్టుబడులు వచ్చే విధంగా చొరవ చూపారని కొనియాడారు.

రైతు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు కలిసి కట్టుగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బేతి శుభాష్ రెడ్డి, మాజీ ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు బండారి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్లు శాంతి శేఖర్, పన్నాల దేవేందర్ రెడ్డి, ప్రభు దాస్, బొంతు శ్రీదేవి, డివిజన్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, ముత్యం రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, నాయకులు కాటిపల్లి రవీందర్ రెడ్డి, సాంబ శివరావు, మారయ్య తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed