రూ. 1.60 కోట్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మాధవరం శంకుస్థాపన

by Disha Web Desk 11 |
రూ. 1.60 కోట్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మాధవరం శంకుస్థాపన
X

దిశ, కూకట్​పల్లి: అల్లాపూర్​ డివిజన్​ పరిధిలో 1.60 కోట్ల రూపాయలతో చేపడుతున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గురువారం స్థానిక కార్పొరేటర్​ సబీహ బేగంతో కలిసి శంకుస్థాపన చేశారు. రూ. 85 లక్షలతో సున్నం చెరువు పార్క్, అభివృద్ధి పనులను, రూ. 75 లక్షల వ్యయంతో గాయత్రినగర్​ షటిల్​ కోర్టు ప్రాంగణంలో అభివృద్ధి పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతి డివిజన్​ను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అల్లాపూర్​ డివిజన్​లో డ్రైనేజి, తాగునీటి పైప్​లైన్​ పనులను, రోడ్డు పనులను పూర్తి చేయడం జరిగిందని అన్నారు. డివిజన్​లో ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.Next Story

Most Viewed