ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హౌస్​ అరెస్ట్​

by Aamani |
ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హౌస్​ అరెస్ట్​
X

దిశ, కూకట్​పల్లి: కేపీహెచ్​బీకాలనీ పరిధిలోని హౌసింగ్​ బోర్డు ఖాళీ స్థలాలను అధికారులు ఈ రోజు వేలం నిర్వహించనున్నారు. గత కొన్ని రోజులుగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, వేలంను అడ్డుకుంటామని, ప్రజలను హౌసింగ్​ బోర్డు అధికారులు మోసం చేస్తున్నారని ఆరోపిస్తూ వస్తుండటంతో కూకట్​పల్లి ఏసీపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తో పాటు కూకట్​పల్లి నియోజకవర్గం కార్పొరేటర్​లు పండాల సతీష్​ గౌడ్​, జూపల్లి సత్యనారాయణ, రవీందర్​ రెడ్డి, ముద్దం నరసింహ యాదవ్​, మందాడి శ్రీనివాసరావు, సబీహా బేగం, ముఖ్య నాయకులను హౌస్​ అరెస్ట్​ చేశారు. తెల్లవారుజామున 5 గంటలకే ఏసీపీ శ్రీనివాస్​ రావు ఆధ్వర్యంలో హౌస్ అరెస్ట్​ చేశారు.

Advertisement

Next Story